ముగిసిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

16 Oct, 2016 20:51 IST|Sakshi
ముగిసిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
  • వైభవంగా  చక్రస్నాన మహోత్సవం
  • వాడపల్లి(ఆత్రేయపురం):
    కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెం దిన శ్రీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆల యంలో ఐదురోజులు పాటు నిర్వహించి న  బ్రహ్మోత్సావాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్బంగా స్వామి వారు కల్కి, అమ్మవారు గజలక్ష్మీ అవతారంలో భక్తులకు  దర్శనమిచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ము గింపులో భాగంగా స్వామివారి  చక్రతీర్థ స్నాన మహోత్సవం  అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామునే విష్వక్షే్సనపూజ, పుణ్యహవచనం, పూర్ణహూతి, బాలబోగం, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలును వైఖానస యువబ్రహ్మ ఆగమ భాస్కర  ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు  ఘనంగా నిర్వహించా రు.  ఈ సందర్బంగా స్వామి వార్ని ఆలయం నుంచి పల్లకి పై ఉంచి  బాణాసంచా కాల్పుల నడుమ బ్యాండ్‌ మేళాలతో స్వామి వారిని గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ స్వామి వా రికి ఏర్పాటు చేసిన ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు  నిర్వహించారు. ఉదయం స్వామివారిని తీర్థ బిందెతో గోదావరి జలాలను తీసుకు వచ్చి సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకించారు. స్వామి వారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. ఉదయం 10 గంటలకు స్వామి వార్ని కల్కి అవతారం, అమ్మవారిని గజలక్ష్మీ అ వతారంలో  గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, మహదాశీర్వచనం, సాయంత్రం 4 గంట లకు అశ్వవాహనంపై స్వామి వారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం స్వామి వార్ని విశేష పుష్పములతో పుష్పాల రాయుడికి  ఉయ్యాల సే వ, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 
     
మరిన్ని వార్తలు