గిరిజనులంటే అంత అలుసా ?

17 Aug, 2017 22:32 IST|Sakshi

అనంతపురం సిటీ: గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేడు గిరిజనులను అలుసుగా చూస్తున్నారని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా నాయక్‌ విమర్శించారు. గురువారం స్థానిక జాతీయ రహదారులు, భవనాల శాఖ అథితి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు రికార్డులకే పరిమితమయ్యాయన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులని వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే టీటీడీ పాలక మండలిలో గిరిజనులకు స్థానం కల్పించాలన్నారు.

గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాలు, బయలు ప్రాంత వాసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస సౌకర్యాలు కూడా లేక వేలాది కుటుంబాలు నేడు దుర్భరమైన జీవితం గడుపుతున్న విషయం ఈ ప్రభుత్వాలకు తెలీదా? అని ప్రశ్నించారు. తమ హక్కులకు భంగం వాటిళ్లకుండా ప్రభుత్వం సహకరించాలని కోరారు. కాదని తన మొండి వైఖరిని అవలంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. త్వరలో పలు డిమాండ్లపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మళ్లికార్జున నాయక్, చిరంజీవి నాయక్, సుధాకరనాయక్, రాంప్రసా«ద్‌నాయక్, రమణా నాయక్, శ్రీనివాసనాయక్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు