మృత్యుంజయరావుకు పురస్కారం

16 Sep, 2016 22:44 IST|Sakshi
మృత్యుంజయరావుకు పురస్కారం

వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం సమన్వయకర్త కోట మృత్యుంజయరావుకు వరదా వెంకటరత్నం స్మారక అవార్డు వరించింది. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని విక్టోరియా జూబ్లీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిత్రాకళా ప్రదర్శనలో ఈయన వేసిన చిత్రానికి అవార్డు లభించింది.

ప్రసిద్ధ 60 చిత్రప్రదర్శనలు మాత్రమే ఇందులో ఉంచగా కోట మృత్యుంజయరావు కృష్ణానది పౌరాణికగాథను ఆధారం చేసుకుని పెయింటింగ్‌ వేశారు. అవార్డులో భాగంగా ఈయనకు ప్రశంసాపత్రం, శాలువా, రూ.6వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మృత్యుంజయరావు మాట్లాడుతూ ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచిపోయిన లలితకళల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు ప్రక్రియను తిరిగి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఈయనకు అవార్డు రావడంపై రెక్టార్‌ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య వై. నజీర్‌అహ్మద్, ప్రిన్సిపాల్‌ ఆచార్య సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు