వానర వీరుడికి వారాహి గ్రంథం

12 Jun, 2016 01:37 IST|Sakshi
వానర వీరుడికి వారాహి గ్రంథం

బాలకృష్ణ సమర్పణలో పురాణ పండ రచనకు కొర్రపాటి ప్రచురణ
వచ్చే నెలలో తిరుపతిలో ఆవిష్కరణ

 నల్లగొండ ‘బాహ్యలోకాల పరిధులను దాటించి, హనుమంతుడి అనంత శక్తి సంపన్న స్వరూపానికి పాఠకులను దగ్గర చేసే విధంగా, అచ్చెరువొందే అందాలతో ఓ మహాగ్రంథాన్ని వారాహి చలన చిత్ర సంస్థ రూపొందిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఐదు వందల ఆంజనేయ ఉపాస్యమూ ర్తులతో, యంత్ర, తంత్రాత్మకమైన ఈ విశేష గ్రంథాన్ని వచ్చే నెలలో తిరుపతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వారాహి చలనచిత్ర సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌమ్యత, ప్రశాంతత, ప్రచండం నిండిన మహావీరుడు హనుమంతుడిపై భక్తితత్వాన్ని ప్రకటిస్తూ సాగే ఈ గ్రంథంలో అంతర్ముఖ ప్రజ్ఞ గోచరించే శాశ్వత సత్యాలు కూడా ఉండే విధంగా రచయిత పురాణపండ శ్రీనివాస్ దీనిని రూపొందిస్తున్నారని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే లక్ష్మీనారసింహుడి కటాక్షం నిండిన ‘శరణు...శరణు’మహా మంత్ర గ్రంథాన్ని, చండీ ఉపాసనకు ప్రతీకగా నిలిచే ‘అమ్మణ్ణి’ గ్రంథాన్ని తిరుమల తిరుపతి వేదపండితులకు, అర్చకులకు బహూకరించిన హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ ఈ గ్రంథానికి సమర్పకులుగా ఉన్నారని పేర్కొ న్నారు. ఈ గ్రంథాలను బహూకరించిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.. పురాణపండకు అభినందన ఆశీర్వచనాలు ఇచ్చినప్పుడే వానర వీరుడి కోసం ఈ గ్రం థానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివ రించారు. వేద, పురాణ, ఇతిహాస కావ్యాల ఆంజనేయంతోపాటు ఈ గ్రంథం ‘పరాశర సంహిత’ ప్రామాణికంగా, పరిపూర్ణ భరితంగా ఉంటుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు