దేశానికి వారసత్వ సంపదగా పురాతన భవనాలు

8 Sep, 2016 23:39 IST|Sakshi
దేశానికి వారసత్వ సంపదగా పురాతన భవనాలు
ఆచంట : దేశానికి వారసత్వ సంపదగా పురాతన భవనాలు నిలుస్తాయని ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఆర్కిటెక్‌ ప్రొఫెసర్‌ గిడుతూరి విశ్వనాథ్‌కుమార్‌ అన్నారు. జిల్లాలోని అద్భుతమైన కట్టడాలలో ఒకటిగా నిలవడంతో పాటు, సెంచరికీ చేరువలో ఉన్న ఆచంటలోని ‘గంధర్వమహల్‌’ను ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఆర్కిటెక్‌ విద్యార్థులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. భవనానికి వాడిన నిర్మాణ సామాగ్రి, ప్లానింగ్, పనిచేసిన కళాకారుల తదితర వివరాలను భవన వారసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. భవనంలో ఉన్న లండన్‌కు చెందిన పియానో, బెల్జియం అద్దాలు, బర్మా టేకు దిమ్మెలు, కళాత్మక ఉట్టిపడేలా నిర్మించిన టేకు గుమ్మాలు ఆర్కిటెక్‌ విద్యార్థులను కట్టిపడేశాయి. ఇటువంటి పురాతన భవనాలు ఆర్కిటెక్‌ విద్యార్థుల భవిష్య™Œ కు ఎంతగానో దోహదపడతాయని, తమ విద్యార్థులు ఇంతకుముందు చెన్నై షాపింగ్‌మాల్, విశాఖపట్టణంలోని ఐఐఎం భవనాలను పరిశీలించినట్టు విశ్వనా«ద్‌కుమార్‌ అన్నారు. రెండు రోజులపాటు భవనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని   చెప్పారు.  
 
 
 
 
 
మరిన్ని వార్తలు