జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నం

17 Oct, 2016 22:03 IST|Sakshi
జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నం
  • తెనాలి : జనతా రాజ్యమే ఏకైక విముక్తి మార్గమని విశ్వసించిన రాడికల్‌ యువజన సంఘం (ఆర్‌వైఎల్‌) రాష్ట్ర తొలి అధ్యక్షుడు, విరసం సభ్యుడు పీజే వర్ధనరావు, తన ఆశయం దిశగా నిబద్ధతతో వ్యవహరించారని పలువురు విప్లవాభిమానులు, సాహితీమిత్రులు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఆకస్మికంగా కన్నుమూసిన వర్ధనరావు అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అయితానగర్‌లోని స్వగహం వద్ద నిర్వహించిన సంతాపసభకు వర్ధనరావు సన్నిహితుడు ప్రదీప్‌ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ జనతా రాజ్యం వర్ధనరావు స్వప్నమని కొనియాడారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాజకీయ మార్గం ఏదైనా వర్ధనరావు మనిషిగా ఉన్నతుడని చెప్పారు. విరసం జిల్లా అధ్యక్షుడు సీఎస్సార్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ విప్లవ భావజాలానికి కట్టుబడినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో భౌతికంగా దూరంగా ఉండిపోయినా, మద్దతును కొనసాగించారని చెప్పారు. సివిల్‌ లిబర్జీస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజారావు మాట్లాడుతూ రాజ్యహింసను అనుభవించి కూడా వర్ధనరావు విప్లవోద్యమానికి అద్భుతమైన కంట్రిబ్యూషన్‌ ఇచ్చినట్టు చెప్పారు. ఆర్‌వైఎల్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ వర్ధనరావు ఆర్‌వైఎల్‌ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, విప్లవోద్యమం జీవించే ఉందనీ, ముందుకు తీసుకెళతామని ప్రతిజ్ఞచేసినవారిలో ఒకరని గుర్తుచేసుకొన్నారు.  జనసాహితి నాయకుడు దివికుమార్‌ మాట్లాడుతూ వర్ధనరావు వంటి ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి వతి సమాజానికి తీరని నష్టమన్నారు. కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.కష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న  కులోన్మాదాన్ని కట్టడి చేయాల్సిన చారిత్రక బాధ్యత ఉందని నమ్మిన వర్ధనరావు తుదివర కు కట్టుబడ్డారని చెప్పారు.  దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ జి.కపాచారి, జేఎస్‌ఆర్‌ కష్ణయ్య, ఉన్నం లక్ష్మయ్య, తురుమెళ్ల శ్యాంషా, ఎంజే విద్యాసాగర్, కనపర్తి బెన్‌హర్‌ మాట్లాడారు. జీఎస్‌ నాగేశ్వరరావు, ఉమారాజశేఖర్, రాఘవరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.
  •  
మరిన్ని వార్తలు