కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వినూత్న నిరసన

12 Dec, 2016 21:35 IST|Sakshi
కాంట్రాక్ట్‌ లెక్చరర్ల వినూత్న నిరసన
 - కరుణించాలని ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం  
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 11 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు సోమవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెగు‍​‍్యలరైజేషన్‌ కోసం నియమించిన ఉపసంఘం సభ్యులైన మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణ,, కామినేని శ్రీనివాస్, పల్లె రగునాథరెడ్డి పటాలకు పాలాభిషేకం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై కరుణ చూపాలంటూ రాష్ట్ర ఐక్య కార్యచరణ సమితి సభ్యుడు ఎన్‌.బ్రహ్మేశ్వర్లు, జిల్లా సంక్షేమ సంఘం సభ్యుడు పి.రంగస్వామి వేడుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.  పదకొండో రోజు దీక్షకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.శ్రీనివాసులు, ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కె.బలరాం, జేఏసీ జిల్లా కన్వీనర్‌ వీఎం వెంకటేశ్వర్లు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ నవీన్‌కుమార్, సునీత, కె.శ్రీనివాసులు, ఈశ్వర్, అప్పాంజినేయులు, సోమేష్, చాంద్‌బాషా, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, నాగరాజు, రవి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు