'కంచె'కు భరతముని ఫిల్మ్ అవార్డు

18 Sep, 2016 11:26 IST|Sakshi
'కంచె'కు భరతముని ఫిల్మ్ అవార్డు

మదనపల్లె : భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా కంచె సినిమా ఎంపిక అయింది. ఫెస్టివల్ వివరాలను భరతముని ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్రకటించా రు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గానికి అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు.
 
అవార్డుల ఎంపికలో రన్నింగ్, బాక్స్ ఆఫీస్ హిట్ తదితర విషయాలనే కాకుండా చక్కని కళాత్మక విలువలు, సహజ చిత్రాలు, సామాజిక శ్రేయస్సు, సంప్రదాయం, జాతీయ సమైక్యత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో హైదరాబాదులో జరుగుతుందన్నారు.
 
 ఉత్తమ చిత్రంగా కంచె, సందేశాత్మకచిత్రం దాగుడుమూతలు, హాస్య చిత్రం భలేభలే మగాడివోయ్, చారిత్రాత్మకచిత్రం రుద్రమదేవి, ప్రజాదరణ చిత్రం బాహుబలి, ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంసానటుడు వరుణ్‌తేజ్, నటి అనుష్క, విలన్‌గా తనికెళ్ల భరణి ఎంపికయ్యారు. వివిధ కేటగిరీల్లో కూడా అవార్డులను  ప్రకటించారు.

మరిన్ని వార్తలు