సామాజిక సేవలో ‘వాసవీ’ ముందంజ

25 Jul, 2016 00:48 IST|Sakshi

హన్మకొండ : సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో వాసవీ క్లబ్‌ ముందంజలో నిలుస్తోందని క్లబ్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు పబ్బ విజయ్‌కుమార్‌ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని నందన గార్డెన్స్‌లో వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అర్ధ వార్షిక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాల గవర్నర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించగా, అత్యుత్తమ సేవలు అందించిన క్లబ్‌ల బాధ్యులను సన్మానించారు. అనంతరం విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఏర్పాటైందన్నారు. ఈ మేరకు వివిధ క్లబ్‌ల బాధ్యులు పోటీ పడి పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని సూచించారు.

సమావేశంలో క్లబ్‌ ప్రతినిధులు గార్లపాటి శ్రీనివాస్, పొట్టి శ్రీనివాస్, యాదా నాగేశ్వర్‌రావు, ఐత రాములు, వెంకటరమణమూర్తి, ఏవీఎస్‌ఎన్‌.గుప్త, శెట్టి శ్రీరాములు, వెంకటరమణమూర్తి, తాడిశెట్టి వెంకట్రావు, పావుశెట్టి అయోధ్యరాములు, గాయత్రి, ప్రకాశ్, ఐత మురళీధర్, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు