వాసవీక్లబ్‌ నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ

2 Jan, 2017 02:04 IST|Sakshi
వాసవీక్లబ్‌ నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ

నాగర్‌కర్నూల్‌ విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని వాసవీ, వనితా క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 2017 నూతన సంవత్సర క్యాలెండర్లను ఇంటర్నేషనల్‌ మల్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ హకీం రాజేష్, డిప్యూటీ గవర్నర్‌ కొట్ర బాలాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా పేద ప్రజల కోసం వాసవీ, వనితాక్లబ్‌లు ఎన్నో రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇకముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హామీఇచ్చారు.

ఇదేరోజు వాసవీక్లబ్‌ సభ్యులు కోదండరాం, బాదం శ్రీనుల జన్మదినం కావడంతో వారితోనే నూతన సంవత్సర, బర్త్‌డే కేక్‌లను కట్‌చేయించి సంబరాలు జరుపుకున్నారు.  వాసవీ, వనితాక్లబ్‌ అధ్యక్షులు బాదం శివకుమార్, పూర్ణిమ, ప్రధాన కార్యదర్శులు మలిపెద్ది రమేష్, కవిత, కోశాధికారి మిడిదొడ్డి ప్రవీణ్, మాధవి, జోన్ చైర్మన్ రాఘవేందర్, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రాఘవేందర్, మాజీ అధ్యక్షులు డీవీ.నారాయణ, సాయిబాబు, దొంతు శంకర్, బాదం పరమేష్, ఉజ్వల్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు