శ్రీమఠంలో వేదవ్యాస పూజ

9 Oct, 2016 22:25 IST|Sakshi
శ్రీమఠంలో వేదవ్యాస పూజ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం వేదవ్యాసుడి ఆరాధన పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక పూజామందిరంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు వేదవ్యాసుడి ప్రతిమకు, జయ, దిగ్విజయ, మూలరాముల విశేష పూజలు గావించారు. శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు పుష్ప, పంచామృతాభిషేకం, మహా మంగళహారతులు చేపట్టారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా సెలవులు భక్తులు వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తుల రాకతో శ్రీమఠం కళకళలాడింది. మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
మరిన్ని వార్తలు