వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం

9 Apr, 2017 23:50 IST|Sakshi

కటారుపల్లి(గాండ్లపెంట) : మండల పరిధిలోని కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం స్వామివారి గొడుగుల ప్రదక్షిణతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్నారు. సేదతీరేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఆలయం వెలుపల గాజులు, బొమ్మలు, మిఠాయి షాపులు వెలిశాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట జొన్నధాన్యాలతో రాసి పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుంభకూడును(ప్రసాదాన్ని) భక్తులు పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటారు.

నేడు బండ్ల మెరవణి
వేమన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పందేరం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులు ఎండ్లబండ్లను అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు.

మరిన్ని వార్తలు