దుగ్గరాజపట్నం పోర్టుకు ఆ ఇద్దేరే అడ్డంకి

12 Sep, 2016 23:08 IST|Sakshi
దుగ్గరాజపట్నం పోర్టుకు ఆ ఇద్దేరే అడ్డంకి
 
  • తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ ధ్వజం 
చిట్టమూరు:
వాకాడు మండలం దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడే అడ్డంకని కాంగ్రెస్‌ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ ఆరోపించారు. చిట్టమూరులో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోర్టు వస్తే లక్షల మంది రైతులు, వేలాది మంది నిరుద్యోగులు బతుకులు బాగుపడతాయన్నారు. కానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ఇద్దరూ కమ్మక్కై పోర్టు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ పోర్టుకు పక్కనే ఉన్న ఓ ప్రవేటు పోర్టు యజమానులకు లొంగిపోయి తమ స్వప్రయోజనాలకు పోర్టు ద్వారా హెలికాప్లర్లు వాడుకుంటూ ప్రభుత్వ పోర్టు నిర్మాణం చేపట్టకుండా చూస్తున్నారని ఆరోపించారు. రూ.25 వేల కోట్లతో నిర్మాణం జరిగే వి«దంగా ప్రణాళికలు తయారు చేశారన్నారు. డిసెంబర్‌ 31 లోపు పోర్టు నిర్మాణ పనులు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్టులో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని చింతామోహన్‌ ఆరోపించారు. 
>
మరిన్ని వార్తలు