3 నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు

14 Sep, 2016 22:06 IST|Sakshi
3 నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు
  • పందిరిరాట ముహూర్తంతో ఏర్పాట్లకు శ్రీకారం
  • తిరుమల తరహాలో 10 రోజుల వైభవంగా నిర్వహణ
  • యానాం టౌన్‌ :
    ‘మీసాల వెంకన్న, చల్దికూడు వెంకన్న, యానాం వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వెంకటేశ్వరస్వామి వారి 14వ బ్రహ్మోత్సవాలను అక్టోబర్‌ 3 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆలయ ప్రాంగణంలో పందిరిరాట ముహూర్తాన్ని వేదపండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. యానాం వెంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. పందిరిరాట ముహూర్తం సందర్భంగా ఆలయంలో అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యులు, నరసింహాచార్యులు, పెద్దింటి రఘురామవినోద్‌ తదితరులు మంగళవాయిద్యాల మధ్య వేదమంత్రాలతో విశేష పూజలను నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, ప్రతినిధులు కాదా వెంకటేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, గంధం శంకరరావు, కె.గాంధీ, ఎక్స్‌ప్రెషన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మద్దింశెట్టి జియన్న దంపతులు పూజలు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను కమిటీ ఆ««దl్వర్యంలో చేపట్టనున్నట్టు ఉమాశంకర్‌ తెలిపారు. రోజూ వాహనోత్సవాలు, ఆలయంలో వేదపండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో పూజలను నిర్వహిస్తామన్నారు.
     
మరిన్ని వార్తలు