హాకీ కోచ్‌గా వెంకటేశ్వర్లు

12 Dec, 2016 14:45 IST|Sakshi

దేవనకొండ: ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ పోటీలకు తెర్నెకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం సునీలమ్మ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానాలోని సోనిపట్‌ ప్రాంతంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గతంలో ఈయన దాదాపు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీలకు కోచ్‌గా వ్యవహరించారన్నారు. గ్రామ సర్పంచు రాజన్న, ఉపసర్పంచు సత్యరాజు, ఎంఈఓ యోగానందం, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఎంపీపీ రామచంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు