నంద్యాల డీఎస్పీగా వేణుగోపాల్‌కృష్ణ

4 Jul, 2017 22:34 IST|Sakshi
కర్నూలు : పోలీసు శాఖలో డీఎస్పీల బదిలీలు ప్రారంభమయ్యాయి. మొదటి విడత రాష్ట్రంలో 17 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా (డీఎస్పీ) పనిచేస్తున్న ఎస్‌.వేణుగోపాలకృష్ణను నంద్యాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన ఈయన 1989లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు.
 
జిల్లాలోని చాగలమర్రి, ఉయ్యాలవాడ, మహానంది, గడివేముల, కోవెలకుంట్ల, శిరివెళ్ల, మిడుతూరు, ఎమ్మిగనూరు రూరల్, కొలిమిగుండ్ల డీసీఆర్‌బీలో సేవలు అందించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు రూరల్, జమ్మలమడుగు అర్బన్, బనగానపల్లె, డీసీఆర్‌బీ కర్నూలులో పనిచేశారు. 2012లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుపతి రైల్వే, చిత్తూరు సీసీఎస్‌లో పనిచేసి ఏడాదిన్నర క్రితం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలానికి వచ్చారు. హరినాథరెడ్డిని విజయవాడ చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు