భానుకిరణ్ బెయిల్పై సాయంత్రం తీర్పు

27 Jul, 2015 14:29 IST|Sakshi
భానుకిరణ్ బెయిల్పై సాయంత్రం తీర్పు

హైదరాబాద్: సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పై సోమవారం తీర్పు వెలవడనుంది.

 

గడిచిన మూడేళ్లుగా జైలులో ఉంటోన్న భానుకిరణ్.. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాలుగు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ సాయంత్రం తీర్పును వెల్లడించనుంది. బెయిల్ మంజూరుచేస్తే భానుకిరణ్ పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

2011జనవరి 3న మద్దెలచెరువు సూరి హత్యకు గురైన తర్వాత ఏడాదిన్నరపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన భానుకిరణ్.. ఆ తరువాత పోలీసులకు చిక్కాడు. బయటికి వస్తే సూరి అనుచరులనుంచి ప్రాణహాని ఉందని భావించిన భాను..  ఒకటిరెండు సార్లకు మించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. తాజాగా నాలుగు రోజుల కిందట బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

మరిన్ని వార్తలు