కేసీఆర్ నీ కొడుకును అదుపులో పెట్టుకో: వీహెచ్

8 May, 2016 14:23 IST|Sakshi

ఖమ్మం: 'నీ కొడుకును అదుపులో పెట్టుకో' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) సూచించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీహెచ్ విలేకర్లలో మాట్లాడుతూ.... కాంగ్రెస్‌ను బొంద పెడతాం, అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మంత్రి కేటీఆర్ లండన్‌కు పరిమితం అయ్యేవాడని ఎద్దేవా చేశారు. పాలేరులో ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని వీహెచ్ చెప్పారు.

మరిన్ని వార్తలు