వైభవంగా పవిత్రావరోహణ

21 Aug, 2016 00:27 IST|Sakshi
వైభవంగా పవిత్రావరోహణ
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవున తెలిసీ తెలియక జరిగిన తప్పులకు ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు నాలుగురోజుల పాటు ఘనంగా సాగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి హోమాన్ని, మహదాశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు.
 
శ్రీవారి మూలవిరా, పద్మావతి, ఆండాళ్‌ అమ్మవార్లపైన, ఉత్సవమూర్తులపైన ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాలు సందర్భంగా నాలుగు రోజులుగా నిలిచిన ఆర్జిత సేవలు, నిత్యార్జిత కల్యాణాలు శనివారం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు