విద్యాకమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ నేడు

25 Jul, 2016 18:02 IST|Sakshi
నక్కపల్లి: గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ దఫా పాఠశాలలు  ఇందుకు వేదికయ్యాయి.  ఎస్‌ఎంసిలు( స్కూల్‌మేనేజ్‌మెంట్‌ కమిటీ)కు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని హమీ ఇచ్చారు. అది నెరవేర్చకపోగా ఇంటికో పదవి ఇవ్వడానికి గాను ఈ విద్యాకమిటీ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న వాదన వినిపిస్తోంది.  మంగళవారం ఈ ఎన్నిలకు సంబందించి నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపధ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణ  నెలకొంది. . ఎస్‌ఎంసి ఎన్నికలు పుణ్యమాఅని  దేవాలయాల్నాంటి  విద్యాలయాలు  రాజకీయాలకు కేంద్రబిందువు కానున్నాయి. వాస్తవంగా ఈనెల 20న ఈ ఎన్నిలకు నోటిఫికేషన్‌ ఇచ్చి 26న ఎన్నికలు నిర్వహించాల్సి  ఉంది.అయితే ఏపిటీఎఫ్‌ రాష్ట్రమహా సభలు జరుగుతున్న నేపధ్యంలో ఈ ఎన్నికల నిర్వాహణను ప్రభుత్వం వాయిదా వేసింది.   26న నోటిఫికేషన్‌ ఇచ్చి ఆగష్టు 1న ఎస్‌ఎంసి చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్దతిలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికలు రసవత్తరం కానున్నాయి. పార్టీలకతీతంగా  పాఠశాలల అభివద్దిప్రణాళికలను చర్చించేందుకు మాత్రమే ఏర్పాటవుతున్న ఈ కమిటీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీనికి సంబందించి ఎన్నికల షెడ్యూలునుప్రభుత్వం ప్రకటించింది. ఈనెల ) ఎలిమెంటరీ, యూపి పాఠశాలలు( 1నుంచి 8 తరగతులవరకు ఉన్న పాఠశాలల్లో మాత్రమే) ఎన్నికలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం  నోటిఫికేషన్‌ విడుదల, మద్యాహ్నం ఓటర్ల జాబితా ప్రకటన( పాఠశాలల్లో చదివే విద్యార్దుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు) జరుగుతుంది. 29న తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది.అదేరోజు మద్యాహ్నం అభ్యంతరాలను పరిశీలించి సరిచేసిన ఓటర్ల జాబితాను తిరిగి ప్రకటిస్తారు. 1న ఉదయం చేతులెత్తే పద్దతిలో  ఎస్‌ఎంసి సభ్యులను ఎన్నుకుంటారు. 1నుంచి 5 తరగతుల వరకు ఉన్న పాఠశాలల్లో అయితే తరగతికి ముగ్గురుచొప్పున 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 1నుంచి ఏడు తరగతులున్న యూపి పాఠశాలల్లో 21మందిని, 1నుంచి 8 తరగతులున్న ఉన్నత పాఠశాలల్లో 24 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ముగ్గురులోబీసినుంచి ఒకరు ఎస్‌సి, ఎస్‌టినుంచి ఒకరు, జనరల్‌ కేటగిరినుంచి ఒకరు ఉండాలి. వీరిలో  ఇద్దరు మహిళలు ఉండాలి.  ఇలా ఎన్నికయిన సభ్యులు ఆగష్టు 1వ తేదీ మద్యాహ్నం  తమలో ఒకరిని చైర్మన్‌గాను, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే పర్వాలేదు. పోటీ అనివార్యమయినా చేతులెత్తే పద్దతి కావడంతో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్న ట్లయితే బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తంమీద   ఈ ఎన్నికలు ఉపాధ్యాయులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ప్రత్యేకంగా అధికారాలు, హక్కులు లేకపోయినప్పటకి రాజకీయంగా ప్రాదాన్యత, ఉనికి చాటుకోవడం కోసం   ఎస్‌ఎంసి చైర్మన్‌ పదవికోసం పలువురు పోటీపడటంతో గ్రామాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పాఠశాలలకు కేటాయించే అభివద్దికమిటీ నిధులను ఖర్చు చేసేందుకు ఈ కమిటీలు తీర్మానంచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీకి మెంబర్‌కన్వీనర్‌గా పాఠశాల హెచ్‌ఎం వ్యవహరిస్తారు. నాకూ ఒక పదవి ఉంది అని చెప్పుకోవడం కోసం పలువురు  ఈ పదవికోసం పైరవీలు ప్రారంభించారు. దేవాలయాల్లాంటా విద్యాలయాల్లో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయాలేక వివాదాలకు కారణమవుతాయా అన్నది వేచి చూడాలి. 
 
ఎన్‌ఎస్‌వి సత్యనారాయణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు: ఎస్‌ఎంసి ఎన్నికల నిర్వాహణతో పాఠశాలలకు రాజకీయాలకు కేంద్రబిందువులు కానున్నాయి. తరగతిలతో విద్యార్దుల తల్లిదండ్రులను ఇలా చేతులెత్తే పద్దతిలో ఎన్నుకోవడం సరికాదు. మెరిట్‌ విద్యార్దుల తల్లిదండ్రులనే నేరుగా నామినేట్‌ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. ఎన్నికలు అనేసరికి ప్రతిపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గ్రామాల్లో మళ్లీ రాజకీయ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది.
 
 
మరిన్ని వార్తలు