విజిలెన్స్‌ కమిటీ తనిఖీలు

26 Aug, 2016 22:46 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంబీఎల్‌ శ్రీధర్‌
మన్ననూర్‌ : పేద విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విచారణ చేపడుతున్నామని సెల్‌ సైడ్‌ ఆఫ్‌ డిపార్టుమెంట్‌ (విజిలెన్స్‌) ఆఫీసర్‌ ఎంబీఎల్‌ శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం మన్ననూర్‌లోని పీటీజీ పాఠశాలలో వివిధ రికార్డులను విజిలెన్స్‌ బందం సభ్యులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తమ దష్టికి వచ్చిందన్నారు. తమ నివేదికను త్వరలో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు అందజేస్తామన్నారు. ఇందులో విజిలెన్స్‌ ఏఎస్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ మహమూద్‌అలీ, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు భాస్కర్‌రావ్, ప్రిన్సిపాల్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు