విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు

4 Aug, 2016 23:06 IST|Sakshi
విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
 
– వ్యవసాయశాఖ విజిలెన్స్‌ బృందం ఏడీఏ సురేష్‌బాబు
వెంకటగిరి : ఎరువుల దుకాణదారులు విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్‌ బృందం ఏడీఏ రమేష్‌బాబు హెచ్చరించారు. గురువారం వెంకటగిరిలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.  ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో పురుగు మందులు, ఎరువుల నాణ్యత, అమ్మకం రేట్లు, అమ్మే ఎరువులకు సంబంధించి అనుమతి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించిందన్నారు. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పొదలకూరు డివిజన్లలో తనిఖీలు చేయగా 27 ఎరువులు, 15 పురుగుమందుల దుకాణాల్లో  సుమారు రూ.60 లక్షల విలువైన ఎరువులు, సుమారు రూ.50 లక్షల విలువైన పురుగు మందులను దుకాణదారులు అనుమతి లేని కంపెనీల సరుకు అమ్ముతున్నట్లు గుర్తించామని, వాటి అమ్మకాలు నిలుపుదల చేసినట్లు చెప్పారు. వీరికి 21 రోజులు గడువు ఇచ్చి క్రమబద్ధీకరించుకునేలా అవకాశం ఇస్తామని, స్పందించని దుకాణదారుల్లోని ఎరువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్‌ బృందం సభ్యులు ఎంసీ మద్దిలేటి (ఏడీఏ రాయదుర్గం, అనంతరంపురం జిల్లా) రవీంద్ర (ఏఓ తాడిపత్రి ) డక్కిలి వ్యవసాయాధికారిణి సుజాత, వెంకటగిరి ఏఈఓ ఎస్పీ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు