జ్యోతికశ్రీకి కలెక్టర్‌ అభినందనలు

10 Jun, 2017 00:19 IST|Sakshi
జ్యోతికశ్రీకి కలెక్టర్‌ అభినందనలు

విజయవాడ : జూలై 12 నుంచి 15వ తేదీ వరకు కెన్యా దేశంలో నిర్వహించనున్న వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌ షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో భారతదేశం తరుపున ఎంపికైన విజయవాడకు చెందిన దండి జ్యోతికశ్రీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంను కలిశారు. కలెక్టర్‌ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచి దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. గతంలో ఏషియన్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌లో 4వ స్థానం సాధించిన జ్యోతికశ్రీ విజయవాడ నగరానికి చెందటం గర్వకారణమని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆమె నగరంలో సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుందని జిల్లా క్రీడాల అధికారి బి.శ్రీనివాసరావు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఎస్‌డీఓతోపాటు కోచ్‌ డి.ఎన్‌.వి. వినాయక ప్రసాద్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు