అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘విక్కీస్‌ డ్రీమ్‌’

1 Aug, 2016 01:27 IST|Sakshi
అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘విక్కీస్‌ డ్రీమ్‌’
హన్మకొండ కల్చరల్‌ : ‘ఆదిత్య – జీనియస్‌ చిత్రంతో గుర్తింపు పొందిన విద్యావేత్త భీమగాని సుధాకర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విక్కీస్‌డ్రీమ్‌’ లఘచిత్రం కూడా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. పోలెండ్‌లో ఇంటర్నేషనల్‌ చిల్ర్టన్‌ మీడియా అధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిత్రోత్సవంతో పాటు ముంబైలో జరగనున్న షార్ట్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని సుధాకర్‌ తెలిపారు. విద్యారంగంలో పోటీతత్వం పెరిగి అర్హతలు లేనప్పటికీ డబ్బుతో తన కుమారునికి అవార్డు ఇప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమైన తండ్రి, ఆయన కుమారుడి మానసిక సంఘర్షణల నేపథ్యంలో 32 నిముషాల వ్యవధితో విక్కీస్‌ డ్రీం లఘు చిత్రాన్ని నిర్మించినట్లు సుధాకర్‌ వివరించారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు