బాబోయ్.. చీమలు.. కాపాడండి..

17 Aug, 2015 15:59 IST|Sakshi
బాబోయ్.. చీమలు.. కాపాడండి..

కొత్తూరు: క్రమశిక్షణకు మారుపేరనే గోప్పేమోగానీ చీమలతో మనుషులు అనుభవించే బాధలు అన్నీ ఇన్నీకావు. ఆ బాధలు భరించరానివైనప్పుడు.. ఇదిగో వ్యవహారం ఇలా ఫిర్యాదుల వరకూ వెళుతుంది. గ్రామంపై చీమల దండ్లు దాడిచేశాయని, వాటిబారి నుంచి తక్షణమే తమను ఆదుకోవాలని ఉన్నతాధికారులను ఆశ్రయించారు శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం పులివెందులపాటి గ్రామస్తులు.

మూకుమ్మడిగా సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న గ్రామస్తులు.. గ్రామంలో చీమల విహారం పెరిగిపోయిందని, ఆహార పదార్థాలపై దాడిచేసి ఒక్క ముక్కా మిగల్చకుండా ఎత్తుకెళుతున్నాయని ఎంపీడీవో వెంకటరామన్ కు ఫిర్యాదు చేశారు. గమాక్సిన్, పాల్‌డాల్ వంటి పురుగుల మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని, వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ.. మండల వైద్యాధికారి కృష్ణమోహన్‌ను పిలిపించి సమస్యపై చర్చించారు. ఎలాగైనాసరే చీమల బెడద వదిలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కొద్దిగా శాంతించిన గ్రామస్తులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు