కోవెలకుంట్లలో విషజ్వరాలు

25 Mar, 2017 22:46 IST|Sakshi
కోవెలకుంట్లలో విషజ్వరాలు
- ఇద్దరు విద్యార్థులకు డెంగీ లక్షణాలు
- ఆరుగురికి మలేరియా
- నలుగురికి  పసిరికలు
 
కోవెలకుంట్ల: పట్టణ ప్రజలు విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రంగరాజుపేటలోని 1, 2 వార్డులు జ్వర బాధితుల సంఖ్య అధికంగా ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న మహ్మద్‌ రఫీ, నౌషార్‌ కుమారులు షాబీద్, మసూద్‌ అనే విద్యార్థులకు డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రులలో చూపించినా నయం కాకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ఇదే వార్డుల్లోని సానియా, అస్లాం, షాజిదా, రహీమాన్, మస్తాన్, మహ్మద్‌ మలేరియా జ్వరంతో బాధపడుతూ పట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. అత్తార్‌ అస్లాం, మగ్బుల్‌తోపాటు మరో ఇద్దరు పసిరికలతో బాధపడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత వైద్యాధికారులు పరిశీలించి జ్వరాల నియంత్రణకు చరయలు తీసుకోవాలని కోరతున్నారు.  
 
మరిన్ని వార్తలు