వస్త్రధారణపై వివియన్‌ రిచర్డ్స్‌ కుమార్తె వ్యాఖ్యలు

11 Aug, 2016 23:00 IST|Sakshi
చర్చాగోష్టిలో పాల్గొన్న ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబాగుప్తా

బంజారాహిల్స్‌: నలుగురిలో ప్రత్యేకంగా నిలిపేవి, మన వ్యక్తిత్వాన్ని చాటే దుస్తులను ధరించాలని బాలీవుడ్‌ నటి నీనాగుప్తా, వెస్టిండిస్‌  మాజీ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ల కుమార్తె, ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వ్‌ ఆధ్వర్యంలో ‘ డిజైన్‌ యువర్‌ పర్సనాలిటి ’ పేరుతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ప్రపంచ ఫ్యాషన్‌ పరిశ్రమలో మన దేశం ఇప్పుడిప్పుడే సత్తా చాటుతోందన్నారు. సోనమ్‌ కపూర్, అలియాభట్‌ సహా పలువురు నటీమణులకు తాను దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. రిట్జ్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ వనజా బంగారి కార్యక్రమ సంధానకర్తగా వ్వవహరించారు. ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ పద్మారాజగోపాల్‌ సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు.   

 

మరిన్ని వార్తలు