హోరాహోరీగా వాలీబాల్‌ టోర్నీ

10 Jun, 2017 23:38 IST|Sakshi
హోరాహోరీగా వాలీబాల్‌ టోర్నీ

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు రెండోరోజైన శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు సూపర్‌లీగ్‌ దశకు చేరుకున్నాయి. పామిడి, వైఎస్సార్‌ కడప, సంజీవరెడ్డి స్టేడియం జట్టు, అనంతపురం మెడికల్‌ జట్లు లీగ్‌ స్థాయి పోటీల్లో గెలిచి సూపర్‌లీగ్‌కు చేరుకున్నాయి. సూపర్‌లీగ్‌ మ్యాచ్‌లు శనివారం సాయంత్రం, ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు సీఐలు సాయిప్రసాద్, రియాజ్, తబ్రేజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదివారం టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు మనోహర్‌రెడ్డి, జబీర్, గౌడ్, నసీమాబాను, ప్రవీణ్‌కుమార్, రమేష్, రామాంజినేయులు, సురేష్, నరేష్‌ రెఫరీలుగా వ్యవహరించారు.

లీగ్‌ మ్యాచ్‌ వివరాలు..
- డీఎస్‌ఏ అనంతపురం జట్టును 25–21, 18–25, 15–6 (2–1) తేడాతో అనంతపురం మెడికల్ జట్టు ఓడించింది.
- నెల్లూరు జట్టుపై 18–25, 25–20, 15–12 (2–1) తేడాతో వైఎస్సార్‌ కడప జట్టు గెలిచింది.
- కర్నూలుపై 21–25, 25–23, 15–10 (2–1) తేడాతో వైఎస్సార్‌ కడప జట్టు విజయం సాధించింది.
- చిత్తూరు జట్టును 25–17, 25–16 (2–0)తేడాతో పామిడి జట్టు ఓడించింది.
- ఎస్‌ఆర్‌ స్టేడియం జట్టు 25–17, 25–16 (2–0) తేడాతో నార్పల జట్టును ఓడించింది.
- చిత్తూరుపై ప్రకాశం 32–30, 25–18(2–0) తేడాతో గెలిచింది.

సూపర్‌లీగ్‌ పోటీలు..
- పామిడిపై అనంతపురం మెడికల్‌ జట్టు 25–14, 25–20 (2–0) తేడాతో విజయం సాధించింది.
- వైఎస్సార్‌ కడప జట్టుతో మ్యాచ్‌లో 24–26, 25–23, 15–13 (2–1) తేడాతో ఎస్‌ఆర్‌ స్టేడియం జట్టు గెలిచింది.

మరిన్ని వార్తలు