ఒడ్డూపొడవూ, ఒడుపూవేగం..

26 Feb, 2017 22:48 IST|Sakshi
ఒడ్డూపొడవూ, ఒడుపూవేగం..
  • వాలీబాల్‌లో ఇవే గెలుపు సూత్రాలు
  • దిగ్గజ క్రీడాకారులకు వేదికైన గొల్లవిల్లి టోర్నీ
  • అమలాపురం :
    వాలీబాల్‌ క్రీడలో రాణించాలంటే మాటలు కాదు. పొడవుండాలి.. బలముండాలి.. రాణించాలనే తపనుండాలి.. కఠోరంగా శ్రమించాలి.. అలుపెరగని సాధన చేయాలి. అంతకు మించి ఆత్మవిశ్వాçÜం, తెలివీ, సమయస్ఫూర్తీ ఉండాలి. పక్కనే ఉన్న క్రీడాకారులను సమన్వయం చేసుకుని పాయింట్లు సాధించాలి. వీటన్నింటి ఫలితంగానే జట్టుకు విజయం సొంతమవుతుంది. వేగమూ, గురీ కీలకమైన ఈ క్రీడలో మన క్రీడాకారులెందరో 
    జాతీయస్థాయిలో రాణించడమే కాదు..
    అంతర్జాతీయ క్రీడావేదికలపైనా దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. గొల్లవిల్లిలో జరుగుతున్న నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్‌ నేషనల్‌ వాలీబాల్‌ ఇన్విటేష¯ŒS మె¯ŒS అండ్‌ ఉమె¯ŒS టోర్నమెంట్‌లో పాల్గొంటున్న వారిలో పురుషుల విభాగంలో తులసిరెడ్డి, ప్రదీప్, ప్రసాద్‌బాబు, శేఖర్‌ధామ¯ŒS, కృష్ణంరాజు, నరేష్, రాజశేఖర్, సొహె¯ŒSకుమార్, మహిళల విభాగంలో హైమ, శాంతి, రైజా, జ్వాలాలత వంటి  అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు.
     
    అథ్లెటిక్స్‌ నుంచి అంతర్జాతీయ క్రీడాకారునిగా..
    చెన్నై ఇ¯ŒSకం ట్యాక్సుజట్టుకు చెందిన ప్రసాద్‌బాబు 2012లో రష్యాలో జరిగిన జూనియర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో పాల్గొన్నారు. తరువాత మరో నాలుగుసార్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. ప్రసాద్‌బాబు తొలుత అథ్లెట్‌. 2004లో ప్రమాదం జరగడంతో అథ్లెటిక్స్‌ను వదిలి వాలీబాల్‌ వైపు దృష్టి సారించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. తండ్రి ప్రోత్సాహంతోనే అంతర్జాతీయ క్రీడాకారునిగా మారానంటున్న ఆయన చెన్నై స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 25 మంది శిక్షణ పొంది వివిధ టీమ్‌ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి టోర్నీ గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు తయారవడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రసాద్‌బాబు తెలిపారు. 
    కఠోరశ్రమతో సాధన చేయాలి..
    న్యూఢిల్లీకి చెందిన శేఖర్‌ ధామ¯ŒS సీనియర్‌ నేషనల్‌ జట్టు సభ్యునిగా థాయిలాండ్, రష్యాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా నీరాజనాలందుకుంటున్నారు. ‘వాలీబాల్‌ల్లో రాణించాలంటే ఎత్తు ప్రధానం. ఈ కారణంగానే పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి వాలీబాల్‌ ఆడేందుకు ఎక్కువ మంది వస్తారు. సీఆర్పీఎఫ్‌ నుంచి దేశవ్యాప్తంగా మూడు జట్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆటలో రాణించాలంటే కఠోరమైన శ్రమతో సాధన చేయాల్సి ఉంటుంది’ అని శేఖర్‌ధామ¯ŒS తెలిపారు. 
     
    ఐదు సెట్లు.. రెండున్నర గంటలు.. 
    అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : రెండు మహిళా జట్ల మధ్య రెండున్నర గంటల పాటు ఐదుసెట్లుగా సాగిన వాలీబాల్‌ మ్యాచ్‌ నరాలు బిగుసుకునే ఉత్కంఠకు గురి చేసింది. గొల్లవిల్లిలో జరుగుతున్న ఎ¯ŒSవీఆర్‌ మెమోరియల్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీలో ఆదివారం ఎస్‌సీ రైల్వే సికింద్రాబాద్, చెన్నై జట్ల మధ్య జరిగిన  పోరులో రెండు జట్లు మొదటి నాలుగు సెట్లలో చెరో రెండు చొప్పున గెలుచుకున్నాయి. తొలిసెట్‌ను చెన్నై 25–14 తేడాతో గెలుచుకోగా, రెండవ సెట్‌ను ఎస్‌సీ రైల్వే 25–22 తేడాతో, మూడవ సెట్‌ను చెన్నై 25–15తో, నాలుగో సెట్‌ ఎస్సీ రైల్వే 25–19 తేడాతో గెలుచుకున్నాయి. కీలకమైన ఐదో సెట్‌ను ఎస్‌సీ రైల్వే 15–13 తేడాతో గెలుచుకుని విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి జరిగిన పోటీల్లో ఆంధ్రా స్పైకర్స్‌ వెస్ట్ర¯ŒSరైల్వే ముంబయిపై 25–20, 25–27, 25–14, 23–25, 15–11 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ సైతం ఉత్కంఠకు గురి చేసింది. తరువాత జరిగిన పోటీలో ఇ¯ŒSకంటాక్స్‌ చెన్నై జట్టుపై 20–25, 25–19, 25–22, 27–25 స్కోర్‌తేడాతో కర్ణాటక పోస్టల్‌ గెలుపొందింది. ఆదివారం జరిగిన మొదటి మహిళామ్యాచ్‌లో సాయి గుజరాత్‌పై 25–19, 25–22, 25–16 స్కోర్‌ తేడాతో కర్ణాటక స్పోర్ట్స్‌ గెలుపొందింది. మూడో రోజు ఆదివారం అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
     
మరిన్ని వార్తలు