వాలీబాల్‌ విజేత రొద్దం

18 Feb, 2017 23:18 IST|Sakshi
వాలీబాల్‌ విజేత రొద్దం

– కబడ్డీ విజేత అనంతపురం
– ప్రారంభమైన అంబేడ్కర్‌ క్రీడోత్సవాలు

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : స్థానిక అనంత క్రీడా మైదానంలో శనివారం అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా  క్రీడాపోటీలు ప్రారంభించారు. పోటీలు సోమవారం వరకూ కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్‌ పోటీలు  నిర్వహిస్తున్నారు.నిర్వహించనున్నారు. మొదటి రోజు నిర్వహించిన  వాలీబాల్‌ పోటీల్లో రొద్దం జట్టు విన్నర్‌గా నిలిచింది. రన్నరప్‌గా పామిడి జట్టు, అనంతపురం జట్టు మూడవ స్థానంలో నిలిచింది. కబడ్డీ విన్నర్‌గా అనంతపురం జట్టు, రన్నరప్‌గా నార్పల జట్టు , గుత్తి జట్టు మూడవ స్థానంలో నిలిచింది.  విజేతలకు  డీఈఓ లక్ష్మీనారాయణ  ట్రోఫీలను అందజేశారు. ప్రతిభ గలవారిని విజయనగరంలో సోమవారం నుంచి 24 వరకూ నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు
అండర్‌–19 వాలీబాల్‌ బాలుర జట్టు
రాము, సూర్యనారాయణ (పామిడి), చందు, లక్ష్మీపతి, ఓంకాంత్‌రెడ్డి, సునీల్, ప్రసాద్, నరసింహమూర్తి(అనంతపురం), ధను (కంబదూరు), సునీల్, హర్షవర్ధన్‌ (పరిగి), మంజు (రొద్దం), చిరంజీవి(బుక్కరాయసముద్రం)

అండర్‌–19 కబడ్డీ జట్టు
సురేష్, సలీం, భరత్‌(అనంతపురం), నాగరాజు, బసవరాజు(విడపనకల్లు), కృష్ణరాజు(హిందూపురం), కుశ్వంత్‌(నార్పల), మహేష్‌ ఆచారి(యాడికి), కుమార్‌(కూడేరు), రమేష్‌(రాయదుర్గం)
స్టాండ్‌బైస్‌ ఇర్షాద్‌ (అనంతపురం), అశోక్‌ (నార్పల), ప్రశాంత్‌ (యాడికి), అనిల్‌ (కూడేరు)

క్రీడలతో మానసికోల్లాసం
        క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని  జేసీ–2 ఖాజామోహిద్దీన్‌ తెలిపారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మొట్టమొదటి సారి  క్రీడా పోటీలను నిర్వఽహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో జిల్లా ఉన్నత స్థానానికి చేరుకుందన్నారు. క్రీడలకు ఆర్‌డీటీ సంస్థ అందిస్తున్న సహకారం ఎనలేనిదన్నారు.  డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింగమయ్య, పీఈటీలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు