పుష్కర భక్తులకు సేవలందించడం ఓ వరం

1 Aug, 2016 23:28 IST|Sakshi
పుష్కర భక్తులకు సేవలందించడం ఓ వరం
నదీ పారిశుధ్యంపై వారికి అవగాహన కల్పించండి
ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో ‘నన్నయ’
వీసీ ముత్యాలునాయుడు
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : పుష్కర స్నానాలకు వచ్చే యాత్రికుల కు సేవలందిండం భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాలని ఆదికవి నన్న య యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నా రు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పుష్కర సేవలలో పాల్గొనే వలంటీర్లకు ఇస్తున్న శిక్షణా శిబిరాన్ని సోమవారం సందర్శించిన ఆయన మెరుగైన సేవల ద్వారా యాత్రికుల అభిమానాన్ని చూరగొనాలన్నారు. గోదావరి అంత్యపుష్కరాల లో స్నానాలు ఆచరించేందుకు దూరప్రాంతాల నుంచి యాత్రికులు వస్తుంటారని, వారికి అవసరమైన సమాచాన్ని అందించడంతో పాటు ఇబ్బందులు పడకుండా సహాయపడాలని సూచించారు. ఘాట్‌ల వద్దకు వచ్చే వృద్ధులు, చిన్నారులు, వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదే సమయంలో గోదావరి జలాలను పరిశుభ్రంగా ఉంచడంపైనా వారికి అవగాహన కలిగించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలోని అనుబంధ కళాశాలలకు చెందిన సుమారు రెండు వేల మంది వలంటీర్లు యాత్రికులకు సేవలందిస్తున్నారని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కేఎస్‌ రమేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.సురేష్‌వర్మ, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.టేకి, ప్రిన్సిపాల్‌లు డాక్టర్‌ మట్టారెడ్డి, డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ అడిషనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నిట్టల కిరణ్‌చంద్ర, పీఓలు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా