ఏడో తరగతి పాసైనా సరే!

11 Dec, 2015 00:26 IST|Sakshi

వీఆర్‌ఏ కారుణ్య నియామకాలకు వెసులుబాటు

 సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ వీఆర్‌ఏ సర్వీస్‌రూల్స్‌కు సంబంధించి గతంలో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీచేసిన జీవో 161 ప్రకారం మరణించిన వీఆర్‌ఏ కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందగోరిన వారికి కనీస విద్యార్హత టెన్త్‌గా ఉండేది. దీంతో తెలంగాణ వీఆర్‌ఏల కేంద్ర సంఘం, తెలంగాణ  రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం(ట్రెసా) విన్నపాల మేరకు సర్కారు వెసులుబాటు కల్పించింది.

సవరణ ఉత్తర్వుల మేరకు బాధిత కుటుంబంలో ఉద్యోగం కోరుకునే వారు ఏడవ తరగతి పాసై ఉంటే చాలు. అయితే.. సదరు అభ్యర్థి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లలో టెన్త్ పాసవ్వాల్సి పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో సర్వీసు నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు