వీఆర్‌ఏల ధర్నా

9 Aug, 2016 00:08 IST|Sakshi
పెగడపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్‌ఏలు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇతర ఉద్యోగుల మాదిరిగానే తాము పనిచేస్తున్నా.. ప్రభుత్వం వేతనాలను సక్రమంగా చెల్లించడంలేదన్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. 010 పద్దు కింద ప్రతినెలా వేతనాలు అందించాలని, అర్హులకు పదోన్నతి కల్పించాలని, కనీన వేతనం రూ.15000కు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ రాఘవచార్యకు వినతిప్రతం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాజమహ్మద్, మహ్మద్‌ రజాక్, ప్రవీణ్, భాస్కర్, మల్లయ్య, స్వామి, నాగరాజు, పోచయ్య, సర్పయ్య తదితరులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు