ఏసీబీకి చిక్కిన వీఆర్వో

30 Jul, 2016 12:43 IST|Sakshi

కరీంనగర్ : పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో... ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో శనివారం  చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన మంద సదయ్య అనే రైతు పట్టాదార్ పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారడు. పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... లంచం తీసుకుంటున్న వీఆర్వో ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు