వరంగల్ ఓటరు ఎవరితో ఉంటాడో?

19 Nov, 2015 17:31 IST|Sakshi
వరంగల్ ఓటరు ఎవరితో ఉంటాడో?

వరంగల్‌: వరంగల్ ఉప ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ఎన్నికల కోడ్ నిబంధన మేరకు ప్రచారం సమయం ముగిసినందున వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో ఓటరుకానీ ప్రచార నాయకులంతా ఆయా ప్రాంతాలనుంచి వెనుదిరుగుతున్నారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ 24న జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉండగా వారిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ తరుపున సర్వే సత్యనారాయణ, టీడీపీ-బీజేపీ కూటమి తరుపున పగిడిపాటి దేవయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున నల్లా సూర్యప్రకాశ్, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ తోపాటు ఇతర సభ్యులు కూడా ఉన్నారు.

కాగా, వరంగల్ లోక్ సభ నియోజవర్గంలో మొత్తం 14,71,920 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు 7,33,412 మంది, మహిళలు 7,38,367 ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూశారు. విమర్శల దాడులు చేసుకున్నారు. అయితే, ఓటరు నాడిని ఏ నాయకుడు పట్టుకున్నాడనే విషయం ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడితే గానీ చెప్పలేని పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీలను ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ను కలవరపడుతోందనే చెప్పాలి.
 

మరిన్ని వార్తలు