జూరాలకు జలకళ

24 Sep, 2016 23:34 IST|Sakshi
జూరాల నుంచి దిగువకు కష్ణమ్మ పరవళ్లు
  •  8 క్రస్టుగేట్ల ఎత్తివేత 
  •  లక్ష 18వేల క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలానికి బిరబిరా కష్ణమ్మ
  • జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శనివారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. లక్షా 26వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 8 క్రస్టుగేట్లను తెరచి 84,176 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి ద్వారా 32వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తం 1,18,756 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41 టీఎంసీల నీటినిల్వ కొనసాగిస్తున్నారు. కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువలకు 450 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 29,057 క్యూసెక్కులు వస్తుండగా మూడు గేట్లను తెరచి 11,500 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులు, మొత్తం 56,500 క్యూసెక్కుల వరద నీటిని నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.28 టీఎంసీల నీటినిల్వ ఉంది. రిజర్వాయర్‌కు 52,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 9 గేట్లను తెరచి 61,560 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కులు మొత్తం 67,560 క్యూసెక్కుల వరద నీటిని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. 
     
     
     
>
మరిన్ని వార్తలు