జూరాలకు పెరిగిన వరద

9 Aug, 2016 23:37 IST|Sakshi
జూరాల: ఎగువరాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు మంగళవారం వరద 1,72,000 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో తొమ్మిది క్రస్టుగేట్లను ఎత్తి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,82,787 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాలలో 8.43 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. నాలుగు టరై్బన్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు