వచ్చే నెలాఖరునాటికి జలసిరి పూర్తి

30 Aug, 2017 22:15 IST|Sakshi

అధికారులకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశం
విజయనగరం పూల్‌బాగ్‌: జిల్లాలో ఎన్టీఆర్‌ జలసిరి కింద మంజూరైన సోలార్‌ పంపుసెట్లను సెప్టెంబర్‌ 30వ తేదీలోగా పూర్తి చేసి వినియోగించుకునేలా పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ సం బం«ధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో డ్వామా, నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్‌ అధికారులు, సోలార్‌ పంపుసెట్లు ఏజెన్సీ లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జలసిరి కింద 1746 బోర్లు మంజూరు చేశామనీ, వాటిలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న మిగిలిన 1150 బోర్లు సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇంతవరకు డీడీ రూపంలో చెల్లించిన లబ్ధిదారులను గుర్తించి ఆయా తేదీల ప్రకారం మొదట చెల్లించిన వారికి మొదటిగా సోలార్‌ పంపుసెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని వాటా చెల్లింపు గురించి ఆరా తీసిన కలెక్టరు పలు ప్రాంతాల్లో లబ్ధిదారుని వాటా సొమ్ము వసూలు చేయలేని ఏపీడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర భుత్వం సబ్సిడీ రూపంలో ఎన్టీఆర్‌ జలసిరి పంపుసెట్లను అందిస్తున్నప్పటి కీ లబ్ధిదారుని వాటా సొ మ్ము వసూలు చేయకపోవటం శోచనీయమని 15 రోజుల్లోగా లబ్ధిదారుని వాటా వసూలు చేసి చెల్లించకపోతే సంబంధిత ఏపీడీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ముఖ్య ప్రణా ళికా«ధికారి జె.విజయలక్ష్మి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్‌ అధికారులు జిన్నా, యాక్సస్, ఆర్‌కే తదితర ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు