నీటి మేఘం

14 Sep, 2017 22:50 IST|Sakshi
నీటి మేఘం

ఈ చిత్రాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది కదూ.. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పైపులైన్‌ ఎయిర్‌ వాల్వ్‌ లీక్‌ అయ్యి గురువారం చోటు చేసుకున్న సందర దృశ్యమిది... పచ్చని పైర్లు.. మధ్యలో రహదారి .. పక్కనే శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌ వాల్వ్‌..ఇందులో కొత్తేమి ఉందనుకుంటున్నారా?

ఆకాశంలో కనిపించాల్సిన నీలిమేఘం భువిపైకి వస్తోందనిపించలె..ప్రకృతిని ఆస్వాదించేవారెవరికైనా అలానే అనిపిస్తుంది.. నీలి మేఘం కాదు.. ఇది నీటి మేఘం.. పైపు లీకేజీతో ఉవ్వెత్తున నీరు ఎగిసిపడుతోంటే ..ఆకాశంలో ఉండాల్సిన మేఘం నేలపైకి వస్తోందా? అన్నట్లు కలిసిపోపిస్తోంది.  ఆపక్కనే కొద్దిదూరంలో ఇంద్రధనస్సు మేఘానికి తోడుగా వచ్చినట్లుగా అనిపిస్తుండడంతో ప్రకృతికి శోభ సంతరించుకుంది.       
- కళ్యాణదుర్గం

మరిన్ని వార్తలు