నస్కల్‌లో నీటి ఎద్దడి

26 Oct, 2016 00:37 IST|Sakshi
నస్కల్‌లో నీటి ఎద్దడి


  రామాయంపేట (నిజాంపేట): నిజాంపేట మండలం నస్కల్ పంచాయతీ పరిధిలోగల నందగోకుల్ గ్రామంలో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్తులు వ్యవసాయబోరుబావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామంలో పుష్కలంగా నీరు ఉన్నా సరఫరా అస్తవ్యస్తంగా ఉంది.   రక్షిత ట్యాంక్ నీరు గ్రామంలో కొంత భాగం మాత్రమే సరఫరా అవుతుంది.  గతంలో నిర్మించిన రెండు మినీ ట్యాంకులను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి.
 
  దీనికితోడు గత పదిహేను రోజులక్రితం నుంచి బోరు కూడా పనిచేయడంలేదు. ఇప్పటి వరకు ఈ బోరునీరే ఆధారమైందని, మరమ్మతు చేయించే విషయంలో శ్రద్ధతీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటికి వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నామని మహిళలు వాపోయారు. కాగా ఇతర బోర్లవద్ద నీరు మురుగు కాలువల్లోకి వృథాగా పోతోందని, ఈ వృథా నీటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనాన అధికారులు, ప్రజాప్రతినిధులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.  
 
 నీళ్లకు మస్తు కష్టముంది               
 నీళ్లకు మస్తు కష్టముంది. బోరు కరాబై 15 రోజులవుతున్నా ఎవరూ పట్టించుకుంటలేదు.  సర్పంచ్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేస్తలేడు. పొద్దున లేవగానే  పంట చేలల్లో ఉన్న బోర్లదగ్గరినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. వెంటనే బోరును రిపేరు చేయించి నీళ్లు సరఫరా చేయాలే.
 - ఊడెపు బాలవ్వ, నస్కల్
 
 ఎవరూ పట్టించుకుంటలేరు                                           
   నీళ్లకు గ్రామంలో మస్తు కష్టమవుతుంది. ప్రధానంగా గ్రామం మధ్యలో ఉన్న బోరు చెడిపోవడంతో ఈసమస్య తలెత్తింది. చెడిపోయిన ఈబోరును మరమ్మతు చేయించాలని  ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు. వెంటనే గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి పరిష్కరించాలి.
 - బురాని రమేశ్, నస్కల్
 
  నీటి ఎద్దడి పరిష్కరిసా
  బోరు మోటారు కాలిపోవడంతో ఈసమస్య తలెత్తింది. వెంటనే దానిని మరమ్మతు చేరుుంచి గ్రామంలో నీటి ఎద్దడి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం.  తాగునీటిని వృధా చేయకుండా  వినియోగించుకోవాలి.       
 -  మన్నె ప్రమీల,  సర్పంచ్, నస్కల్ 

మరిన్ని వార్తలు