రూ.400 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు

16 Sep, 2016 00:06 IST|Sakshi
రూ.400 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
వాకాడు : నియోకవర్గంలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందజేందుకు సుమారు రూ.400 కోట్లతో కండలేరు వద్ద తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నాగజ్యోతి తెలిపారు. గురువారం ఆమె వాకాడు స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న పైలెట్‌ ప్రాజెక్టు వాటర్‌ స్కీంను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఐదు మండలాల్లోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా అయ్యేందుకు పలుచోట్ల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లు ఏర్పటుచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలను, అంచనాలను రెండు, మూడువారాల్లో తయారుచేస్తామన్నారు. గత అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చిన వరదలకు గూడూరు డివిజన్‌లో పలు చోట్ల తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనట్లు చెప్పారు. దీంతో 272 పనులకు రూ.4.40 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాకాడు మండలంలో దెబ్బతిన్న 13 మంచినీటి పథకాలకు రూ. 22.40 లక్షలు ఇచ్చామన్నారు. ఆమె వెంట డీఈ విశ్వనాథరెడ్డి, ఏఈ హేమంత్‌ ఉన్నారు.
మరిన్ని వార్తలు