పీఏబీఆర్‌ కుడి కాలువకు నీరు విడుదల

1 Nov, 2016 23:48 IST|Sakshi

కూడేరు : కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిâýæం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువకు మంగâýæవారం నీటిని విడుదల చేశారు. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ కేశవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై స్విచ్‌ ఆ¯ŒS చేసి నీటిని విడుదల చేశారు.    అనంతరం వారు  డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది ? ఇ¯ŒSప్లో, ఔట్‌ ప్లో, కుడికాలువకు ఎన్ని క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తారు తదితర అంశాలపై ఎస్‌ఈ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. డ్యాంలో 3.5 టీఎంసీల నీరు నిలువ ఉందని, జీడిపల్లి జలాశయం నుంచి 800 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోందని ఎస్‌ఈ వివరించారు.

జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ తయారీకి, 3 తాగునీటి ప్రాజుక్టులకు సుమారు 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కుడికాలువకు 2.5 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని చెప్పారు. కుడి కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదిలి, బుధవారం ఉదయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మొదటి విడతలో కుడికాలువకు ఇరువైపులా పక్కనే ఉన్న చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ లెక్కన 39 చెరువులకు నీటిని నింపుతామన్నారు.  అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ మాట్లాడుతు కాలువకు నీటిని విడుదల చేసి  చెరువులకు నీరందించడం ద్వారా  భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.  

మరిన్ని వార్తలు