కాలువలకు నీటి విడుదల పెంపు

22 Jan, 2017 01:23 IST|Sakshi
కొవ్వూరు : పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,540 క్యూసెక్కుల చొప్పున 130 డ్యూటీలో సరఫరా చేస్తున్నారు. ‘వంతు తంతు’ శీర్షికను శివారు ప్రాంత రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’లో శనివారం ప్రచురిం చిన కథనానికి అధికారులు స్పందించారు. పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కులకు పెంచి 120 డ్యూటీలో సాగునీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇతర కాలువలకు సైతం నీటి విడుదలను పెంచారు. నరసాపురం కాలువకు 1,437, ఉండి కాలువకు 959, జీ అండ్‌ వీకి  455, ఏలూరు కాలువకు 539, అత్తిలి కాలువకు 295 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే ఫాండ్‌ లెవెల్‌ తగ్గడం, గోదావరి నదికి నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నీటి పొదుపు చర్యలు పాటించాలని నీటిపారుదల శాఖ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఫాండ్‌ లెవెల్‌ మూడురోజుల నుంచి 13.38 మీటర్లు వద్ద నిలకడగా ఉంటుంది. దీంతో  అప్రమత్తమైన నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం నుం చి వంతుల వారీ విధానం అమలు చేయనున్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం వరకు మొదటి వంతు ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. 27వ తేదీ సాయంత్రం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రెండో వంతు ప్రాంతంలోని ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తారు. 
 
మరిన్ని వార్తలు