మధ్యమానేరులో 3 టీఏంసీల నీటి నిల్వ

10 Aug, 2016 22:07 IST|Sakshi
ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు
  • చీర్లవంచ ముంపు ప్రాంతంలో అధికారుల పరిశీలన 
  • ప్రమాదం లేదని నిర్ధరణ 
  • సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల మధ్యమానేరులో మూడు టీఏంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ఇరిగేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం ముంపు గ్రామమైన సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామాన్ని మిడ్‌ మానేరు ఇరిగేషన్‌ ఈఈ అశోక్‌ కుమార్, ఎస్‌ఈ శ్రీకాంత్‌ రావు, మధ్యమానేరు ప్రత్యేకాధికారి మనోహర్, సిరిసిల్ల ఆర్డీవో శ్యాప్రసాద్, డీఈఈలు రాజు, దయాకర్, తహసీల్దార్‌ సందర్శించారు. నీటి నిల్వతో బ్యాక్‌వాటర్‌ ఎక్కడిదాకా వచ్చే అవకాశముందో పరిశీలించారు. ఈ వర్షాకాలంలో మూడు టీఎంసీలు నిల్వచేస్తే గ్రామానికి ముంపు ప్రమాదం లేదని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేర్‌ డ్యాం నిండగానే మూడు టీఏంసీల నీటిని ఇక్కడి మధ్యమానేరులో నిల్వచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వారి వెంట చీర్లవంచ సర్పంచ్‌ మారం మంజుల, నాయకులు రాములు తదితరులు ఉన్నారు. 
మరిన్ని వార్తలు