బండపై నీటి ఊట

6 Sep, 2016 20:18 IST|Sakshi
బండరాయిలోంచి ఉబికి వస్తున్న నీరు
  • ఖాజిపల్లిలోని కాళభైరవుడి ఆలయం సమీపంలో వింత
  • మెదక్‌: ఓ ఆలయం పక్కన గల రాతిబండలోంచి నీరు ఉబికి వస్తోంది. ఈ వింత మెదక్‌ మండలం ఖాజిపల్లిలోని శ్రీ కాళభైరవ ఆలయం పక్కన మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజశేఖర్‌ (హైకోర్టు న్యాయవాది)కు గ్రామశివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది.

    ఆ భూమిలో 2010లో సుమారు రూ.20లక్షలు వెచ్చించి శ్రీ కాళభైరవ ఆలయాన్ని నిర్మించారు. యేటా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంతంలో అష్టభైరవ ఆలయం నిర్మించేందుకు కొన్ని రోజులుగా భూమిని చదును చేస్తున్నారు. అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని పగుల గొడుతున్నారు.

    ఈనెల 5న ఓ పెద్ద బండరాయిని పగులగొట్టేందుకు దాని చుట్టూ 4అడుగుల గొయ్యి తవ్వి పగులగొట్టారు. దీంతో ఆ రాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. దీంతో సింగిల్‌ఫేస్‌ మోటర్‌ ద్వారా నీటిని తొలగించినా నిరంతరంగా నీరు వస్తూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వింతను తిలకిస్తున్నారు. ఇది సాక్షాత్తు కాళభైరవుడి మహిమేనంటూ భక్తితో కొలుస్తున్నారు.

మరిన్ని వార్తలు