వెండితెరపై విశాఖ కెరటం

17 Aug, 2016 00:06 IST|Sakshi
వెండితెరపై విశాఖ కెరటం
సీతమ్మధార : ఆ యువకుడికి సినిమా అంటే పిచ్చి. వెండితెరపై కనిపించాలని, స్క్రీన్‌పై తనను తాను చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. కళ్లు మూసినా..కళ్లు తెరిచినా లక్ష్యం వెంటబడుతూనే ఉండేది. కట్‌ చేస్తే అనుకున్నది సాధించాడు. ఎంకా పైకి ఎదగాలని శ్రమిస్తున్నాడు. విశాఖ సీతమ్మధారకు చెందిన గోవర్ధనరెడ్డి ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఎన్నో షార్ట్‌ ఫిల్మ్స్‌లో సత్తా చాటుతున్నాడు. 
  సినీ పరిశ్రమలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఎంతో మంది నటులు హీరోలుగా ఎదిగారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని గోవర్ధన్‌ అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సెక్యూరిటీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన నటనా రంగంలో రాణిస్తున్నారు. పలు సినిమాల్లో హీరోకు స్నేహితుడిగా, పోలీస్‌ అధికారిగా, ప్రేమికుడిగా, విలన్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తున్నాడు. చిన్నతనంలోనే కరాటే నేర్చుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతభి కనబరిచారు. బ్లాక్‌బెల్ట్‌ సాధించారు. 
ఇంతవరకూ నటించిన సినిమాలు
ఇప్పటి వరకు‘‘ లవ్‌ చేయాల వద్దా’లో పోలీస్‌ ఆఫీసర్‌గా చేశాడు, ‘నేత్ర’లో విలన్‌ పాత్ర దామోదర్‌గా నటించాడు, ‘అసలేమయింది’’లో హీరోయిన్‌ను అల్లరి పెట్టే పాత్ర పోషిస్తున్నాడు. 12 షార్టు ఫిల్మ్‌ల్లో నటించాడు. ఎం.ఆర్‌. ప్రొడక్షన్‌లో ‘బ్రదర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌కు విశేష ఆదరణ వచ్చిందని గోవర్ధన రెడ్డి తెలిపారు.
 
మరిన్ని వార్తలు