ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే

27 Sep, 2016 21:37 IST|Sakshi
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి 
–ఎస్‌సీ వర్గీకరణ సాధిద్దాం 
–మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ 
–సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల 
–జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు
తాడేపల్లి గూడెం:
ఎస్‌సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు.  ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన  స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ  భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్‌ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల  తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్‌పీఎస్‌ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్‌సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు.  అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్‌సీఎస్‌టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల  వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన  రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్‌సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్‌సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్‌సింగ్, రాహుల్‌ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు  వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్‌ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
మరిన్ని వార్తలు