శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయలేం

21 Mar, 2016 02:50 IST|Sakshi
శత్రువు అవ్వాలని ఉంటే ఏం చేయలేం

♦ ఇక్కడ పుట్టినవారంతా మా సోదరులే..
♦ వీహెచ్‌పీ  అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా
 
 కరీంనగర్ కల్చరల్: భారతదేశంలో ఉంటూ శత్రువు కావాలని వారికుంటే ఏమీ చేయలేమని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా అన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తల శిక్షణకు ఆదివారం హాజరైన ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారతమాతాకీ జై అంటే వారు తమ వారేనని,  భారతదేశం అంటే ఇష్టంలే ని వారికి ఈ దేశంలో స్థానం లేదన్నారు. ఇక్కడ పుట్టిన వారు తమ సోదరులేనని, భాయి భాయి అంటూనే శత్రువుగా తయారుకావాలని చూస్తుంటే ఏం చేసేది లేదని, వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిం చారు. రానున్న వందేళ్లలో హిందూ దేశంలోనే హిం దువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

 సుప్రభాతసేవలో ప్రవీణ్ తొగాడియా
 వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్టు సభ్యుడు జి. భానుప్రకాష్‌రెడ్డి ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

మరిన్ని వార్తలు