ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తాం

27 Sep, 2016 23:04 IST|Sakshi
ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తాం

–    కొత్త కోర్సులను ప్రారంభిస్తాం
–    యూనివర్సిటీకి ‘బి’గ్రేడ్‌
–    75శాతం హాజరుంటేనే పరీక్షలకు అనుమతి
– ఎంజీయూ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌
ఎంజీయు (నల్లగొండ రూరల్‌)
మహాత్మాగాంధీ యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌ తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్‌ ‘బి’ గ్రేడ్‌ ప్రకటించిందని వెల్లడించారు. ఈ గుర్తింపు వలన యూనివర్సిటీకి, విద్యార్థులకు మంచి గుర్తింపు లభించడంతో పాటు విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.యూనివర్సిటీని సందర్శించిన న్యాక్‌ బృందం వసతులను పరిశీలించి ‘బి’గ్రేడ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మూడు నెలల్లో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గతంలో ఇన్‌చార్జి వీసీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వలన యూనివర్సిటీ అభివృద్ధి జరగడలేదని అన్నారు. పీహెచ్‌డీ, పీజీ కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. 75శాతం హాజరుంటేనే యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రభుత్వం కేటాయించిన 240 ఎకరాల యూనివర్సిటీ భూమి పూర్తిగా నల్లరేగడి కావడంతో నిర్మాణ ఖర్చు అధికమవుతుందన్నారు.
కొండా బాపూజీకి నివాళులు  
కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, వీసీ అల్తాఫ్‌ హుస్సేన్, రిజిస్ట్రార్‌ ఉమేష్‌కుమార్, డైరెక్టర్‌ అంజిరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సేవలను కొనియాడారు.

 

మరిన్ని వార్తలు