-

తెలంగాణకు బహుమతి తేవాలి

30 Sep, 2016 00:17 IST|Sakshi
తెలంగాణకు బహుమతి తేవాలి

అక్టోబర్‌ 3 నుంచి అండర్‌–19 క్రీడాపోటీలు
భువనగిరి టౌన్‌ : వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అండర్‌–19 బాలబాలికల షూటింగ్, బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి తెలంగాణ జట్టు పతకాలు సాధించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్థానికంగా క్రీడలు జరగనున్న మైదానాన్ని గురువారం ఆయన పరిశీలించారు.  క్రీడల నిర్వహణకు లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు.  అంతకు ముందు శిథిలావస్థకు చేరిన జూనియర్‌ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అలాగే పట్టణంలో రూ.30లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు నక్కల చిరంజీవి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, పి.అనిల్‌ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 అర్గనైజింగ్‌ సెక్రెటరీ గువ్వ దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సోమనర్సయ్య, పీఈటీలు రమణ, బాలకిషన్, కోనేటీ గోపాల్, యాదయ్య, మల్లేష్, నర్సింహ, పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు